తప్పు చేస్తే దొరకక తప్పదు

May 02 2024, 08:54

పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను అధిక మెజార్టీతో గెలిపించాలి: దుద్దిల్ల శ్రీనుబాబు

తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటి,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు.

బుధవారం సాయంత్రం కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో శ్రీను బాబు, ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ హాజరై మాట్లా డారు 

మంథని నియోజకవర్గ ప్రాంత అభివృద్ధి ప్రదాత రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ ఇన్చార్జిగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గలలో పర్య టిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. 

ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గడపగడపకు తిరుగుతూ వంశీకృష్ణ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీధర్ బాబు గెలుపు కోసం ఎలా గైతే కష్టపడి 6 గ్యారంటీల ను గడపగడకి తీసుకెళ్ళి విజయం సాధించామో త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇంటిం టికీ 5 న్యాయ్ పథకాలను తీసుకెళ్లి పెద్దపల్లి పార్లమెం ట్ నియోజకవర్గం లో అత్య ధిక మెజారిటీ మంథని నియోజకవర్గం నుండి వచ్చేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషిచేయాలని పిలుపుని చ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 29 2024, 16:38

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్‌

ఏపీలో మే 1న బ్యాంకు ఖాతాల్లోకి పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గ దర్శకాలు జారీ చేసింది. పెన్షన్ల కోసం సచివాలయా లకు రానవసరం లేదని, మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని సర్కార్ నిర్ణయిం చింది. 

బ్యాంక్ ఎకౌంట్ లేనివారికి, దివ్యాంగులు, ఆరోగ్య సమ స్యలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు. మే ఒకటి నుండి 5వ తేదీ లోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు. 

పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారు లకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాల తో విధివిధానాల్లో ప్రభు త్వం మార్పులు చేసింది...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 29 2024, 16:36

ఇంటర్ లో ఫెయిల్ అయినందుకు మరో విద్యార్థిని ఆత్మహత్య

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండ లంలోని ఎర్రచక్రు తండాకు చెందిన గుగు లోతు స్వాతి (17) అనే విద్యార్థిని ఇంటర్ పరీక్ష ఫలితాల్లో పేలవడం తో మనస్థాపానికి గురై ఆత్మ హత్య చేసుకుంది. 

ఎర్రచక్రు తండాలో వ్యవసా య కూలి పనులు చేస్తూ జీవనం గడుపుతున్న గుగులోతు బీమా, పద్మల రెండవ కుమార్తె స్వాతి తొర్రూర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదివి ఇటీవలే పరీక్ష ఫలితాలు రావడంతో ఫెయిల్ అని తెలవడంతో మనస్థాపానికి గురై ఆదివారం రాత్రి పురుగుల మందు తాగింది. 

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మహ బూబాబాద్ లోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్న క్రమంలో సోమ వారం ఉదయం తుది శ్వాస విడిచింది. 

విషయం తెలుసుకున్న మహబూ బాద్ జిల్లా బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోతు కవిత మృతదే హాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 29 2024, 13:00

నేడు ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేని ప్రపంచ డ్యాన్స్​ డేగా కూడా పిలుస్తారు. 64 కళల్లో ఒకటై న డ్యాన్స్​ను గౌరవిస్తూ.. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం జరుపుకుం టారు. 

వివిధ సాంస్కృతిక నృత్యా లను విశ్వవ్యాప్తంగా పరిచ యం చేయడంతో పాటు.. ఈ రంగాన్ని అభివృద్ధి చేయడంకోసం దీనిని నిర్వహిస్తున్నారు. 

జాతి, మత అడ్డంకులు లేకుండా.. అందరూ సంతోషంగా దీనిలో పాల్గొనేలా చూడడమే దీనిముఖ్య ఉద్దేశం..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 27 2024, 16:53

జిల్లా ఆఫీస్‌లో జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించారు.

మాజీ మంత్రి హరీష్ రావు జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 2001 ఏప్రిల్ మాసం హైదరాబాద్ జల దృశ్యంలో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం నేడు దేశానికే ఆదర్శం అయిందని హరీష్ రావు అన్నారు. 

నాడు కొనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసి పదవులకు రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించామని గుర్తు చేశారు. కేసీఆర్ లేకుంటే.. తెలంగాణ లేదని.. తెలం గాణ లేకుంటే.. సిద్ధిపేట జిల్లానే ఉండేది కాదన్నారు. 

గత పదేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌దే అని హరీష్ రావు అన్నారు. కేసీఆర్ అభివృద్ధిలో ఆదర్శంగా ఉంటే.., రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 27 2024, 16:51

ఉపాధి హామీ పనులను పరిశీలించిన గ్రామీణ అభివృద్ధి అధికారి

పెద్దపల్లి జిల్లా పెద్దకల్వల గ్రామంలో శనివారం జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. 

ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడుతూ వేసవికాలం తీవ్రమైన ఎండల పట్ల జాగ్రత్తగా ఉండాలని, కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. 

ఉపాధి హామీ సిబ్బంది పనులకు వచ్చే కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 27 2024, 16:49

తెలుగుదేశం పార్టీ ప్రచార వాహనానికి నిప్పు

తెలుగుదేశం పార్టీ ప్ర‌చార వాహ‌నానికి దుండగులు నిప్పుపెట్టిన ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. 

జిల్లాలోని వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద టీడీపి ప్రచార వాహనంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. వాహనంలో డ్రైవర్‌ ఉండ గానే దుండగులు నిప్పు పెట్టి అక్కడి నుంచి పరారయ్యా రు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా దగ్ధమైంది.

ఇవాళ‌ ఉదయం నంబర్‌ ప్లేట్‌ లేని బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ప్రచార రథంపై పెట్రోల్‌ పోసి నిప్పు పెట్టారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ తీవ్రంగా గాయప డ్డారు. గమనించిన స్థానికు లు అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. స్థానిక సీఐ పులిశేఖర్ టీడీపీ శ్రేణులకు సర్ది చెప్పి నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. 

దాదాపు 2 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోవ డంతో స్థానిక ఎస్సై వెంకటే శ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది చర్యలు చేపట్టారు...

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 27 2024, 16:29

చట్టపరమైన భద్రత లేకనే బీసీ సామాజిక వర్గాల పై దాడులు పాలకూరి రవి

చట్టపరమైన భద్రత లేని కారణంచేత బీసీ సామాజిక వర్గాల పై నిత్యం దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన నల్గొండ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థులు పాలకూరి రవి పాలకూరి రమాదేవి..

నల్గొండ పార్లమెంటు నుండి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు మాట్లాడుతూ..

బీసీ సామాజిక వర్గాలకు చట్టపరమైన భద్రత లేని కారణం చేత కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారని ఇలాంటి భౌతిక దాడులను అరికట్టాలంటే బీసీ సామాజిక వర్గాలలో చైతన్యం రావాలని మన ఓటు మనం వేసుకుంటేనే పార్లమెంట్లో మన గొంతు వినిపిస్తుందని నల్గొండ పార్లమెంటు నుండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో న నిలబడడం జరిగిందని అన్నారు..

వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నటువంటి బీసీ సామాజిక వర్గాలను జెండాలు మోయిస్తూ తమ దగ్గర బానిసల్లాగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

ప్రశ్నించినటువంటి కార్యకర్తలపై కులం పేరుతో దూషిస్తూ భౌతిక దాడులకు పాల్పడడం జరుగుతుంది అని అన్నారు..

ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి గడగోజు విజయ్, బీసీ కుల సంఘాల ఐక్యవేదిక యువజన విభాగం జిల్లా అధ్యక్షులు దొరేపల్లి హరిశంకర్, పట్టణ అధ్యక్షులు బత్తుల శ్రీశైలం యాదవ్,మాదగోని శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 26 2024, 18:09

చిన్నారులని ఆశీర్వధించిన తండు సైదులు గౌడ్

 బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ కుమారుడు,కుమార్తెలను మిర్యాలగూడలో ANM ఫంక్షన్ హాల్ లో హాజరై చిన్నారులని ఆశీర్వదించిన 

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ ఈ కార్యక్రమంలో కనగల్ మండలం గౌడ సంఘం అధ్యక్షులు చింతల విజయ్ గౌడ్, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిలకరాజ్ శీను, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్, మహేష్, తిరుమలేష్, జగన్, కోటేష్ తదితరులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 26 2024, 18:07

నూతన వధూవరులను ఆశీర్వధించిన తండు సైదులు గౌడ్

 కనగంటి వెంకన్న గౌడ్ -రేణుక ల పుత్రిక అనూష -రాజశేఖర్ గౌడ్ లను సాగర్ రోడ్ జూలకంటి ఇంద్ర రెడ్డి ఫంక్షన్ హాల్ లో హాజరై నూతన వధూవరులని ఆశీర్వదించిన 

BRS పార్టీ రాష్ట్ర నాయకులు Ex జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ డా. తండు సైదులు గౌడ్ ఈ కార్యక్రమంలో కనగల్ మండలం గౌడ సంఘం అధ్యక్షులు చింతల విజయ్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు అయితగోని జనార్దన్ గౌడ్,బీసీ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కారింగ్ నరేష్ గౌడ్, బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొంపెల్లి రామన్న గౌడ్ వేణు, సాయి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.